'జర్నీ' హీరో 'జై' డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

  • మద్యం తాగి యాక్సిడెంట్ చేసిన జై
  • కోర్టుకు రాకపోవడంతో లైసెన్స్ రద్దు
  • ఆరు నెలల పాటు రద్దు చేశామన్న అధికారులు
  • వాహనం నడిపితే నేరుగా జైలుకే
పూటుగా మద్యం తాగి, వాహనం నడపడంతో పాటు యాక్సిడెంట్ చేసిన తమిళ హీరో జై డ్రైవింగ్ లైసెన్స్ ను ఆరు నెలల పాటు రద్దు చేస్తున్నట్టు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. గత నెల 21న జై మద్యం తాగి కారు నడుపుతూ, అడయార్ ఫ్లయ్ ఓవర్ ను ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. తనంతట తానుగా డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేసుకోవాలని, లేదంటే ఆగస్టు 5, గురువారం నాడు కోర్టుకు రావాల్సి వుంటుందని పోలీసులు ఆదేశించగా, జై కోర్టుకు రాలేదు.

దీంతో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. ఇక ఆరు నెలల పాటు జై వాహనం నడపడానికి వీల్లేదు. ఒకవేళ వాహనం నడుపుతూ పట్టుబడితే, ఆయనకు కనీసం ఆరు నెలల నుంచి గరిష్ఠంగా రెండేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. 'రాజా రాణి', 'జర్నీ' తదితర చిత్రాలతో జై, తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడు.
Go Back to Shorts
jai
driving lisence
journey

More Telugu News